Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర సీఎంపై నోరుపారేసుకున్న రాణే..
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ రాణేను పోలీసులు అరెస్టు చేశారు. ''ముఖ్యమంత్రికి స్వాతంత్య్రం వచ్చి ఎన్నేండ్లు అయిందో కూడా తెలియదనీ, అలాంటి వ్యక్తి చెంప పగుల కొట్టాలి''అంటూ రాణే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.దీంతో ఆయనపై కేసు నమోదైంది.దీంతో రత్నగిరి పర్యటనలో ఉన్న ఆయనను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నా రు.కాగా,మహారాష్ట్రలోని మూడు నగరాల్లో రాణాఫై కేసు నమోదు విషయంలో అరెస్టు నుంచి ముందస్తు రక్షణ కోరుతూ రాణే బాంబే హైకోర్టును ఆశ్రయించా రు.ఈ కేసులు కొట్టేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థా నంలో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలనీ,ఈ పిటిషన్ను అత్యవస రంగా విచారించా లని కోరారు.అయితే ఈ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు న్యాయస్థా నం అంగీకరించలేదు.అత్యవసర విచారణ కోసం ముందు రిజిస్ట్రీ డిపార్ట్మెంట్లో దరఖాస్తు చేసుకోవాలనీ,అప్పుడే తాము పరిశీలిస్తామని ధర్మాస నం స్పష్టం చేసిం ది.కాగా,కేంద్రమంత్రి నారాయణ రాణే సోమవారం రారుగఢ్ జిల్లా పర్యటన సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడు తూ..ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.15న థాక్రే చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ''ముఖ్యమంత్రికి స్వాతంత్య్ర ం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపో వడం సిగ్గుచేటు.స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన థాక్రే.. మధ్యలో వెనక్కి తిరిగి స్వాతంత్య్రం వచ్చి ఎన్నేండ్లు అయిందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఆ రోజు నేను అక్కడ ఉంటేనా.ఆయన చెంప పగలగొట్టేవాడిని'' అని రాణే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఈ అంశం తీవ్ర దుమారం రేపడంతో..ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.కాగా,20 ఏండ్ల తర్వాత క్యాబినెట్లో కొనసాగుతున్న ఓ కేంద్రం మంత్రి అరెస్టు కావడం ఇదే మొదటి సారి.
కర్రలతో కొట్టుకున్న బీజేపీ, శివసేన కార్యకర్తలు
ఈ అంశంతో బీజేపీ, శివసేన పార్టీల మధ్య చిచ్చురేగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీలకు దిగారు. తాజాగా ముంబయిలో ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడిచేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. రాణే వ్యాఖ్యలను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ర్యాలీగా వెళ్లారు. దాంతో బీజేపీ కార్యకర్తలు కూడా గుంపులుగా వచ్చి వారిని అడ్డగించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.