Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరగా తేల్చండి..: - ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం సూచన
న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ ఆస్తాన్ నియామకం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లో రిటైర్ కావాల్సిన ఆస్తాన్ను కేంద్రం ఢిల్లీ కమిషర్ ఆఫ్ పోలీస్‌గా నియమించింది. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును పలువురు ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లపై విచారణ త్వరగా ముగించాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. రెండు వారాల్లో విచారణ పూర్తిచేయాలని, మధ్యంతర పిటిషన్ దాఖలుచేయడానికి అవకాశం ఇవ్వాలని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది.1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాకేశ్ ఆస్తానా..బీఎస్ఎఫ్ డీజీగా ఉండగా అతడి సర్వీస్ కాలాన్ని కేంద్రం పొడగించింది. జులై 31న రిటైర్ కావాల్సిన ఆస్తానాను జులై 27న ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఈ నియామకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నియామకాన్ని సవాల్ చేస్తూ పలువురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు కావటం చర్చనీయాంశమైంది. వివాదాన్ని సాగదీయాలన్న వ్యూహంతో ఇలా జరిగిందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెబుతున్నారు. రాకేశ్ ఆస్తానా నియామకంపై దాఖలైన పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఆస్తానా నియామకంపై హైకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్ దాఖలయ్యాయని, అసలైన పిటిషన్ వెనుకబడి పోయిందని, మధ్యంతర పిటిషన్‌కు అనుమతించి విచారించాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.