Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆగస్టు 8న జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసిన ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఉత్తమ్ ఉపాధ్యాయ అనే నిందితుడిని ఘజియాబాద్‌లో అదుపులోకి తీసుకున్నా మని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియలో కనిపించిన దృశ్యాల ప్రకారం.. ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసిన ప్రధాన వ్యక్తి అతడేనని పోలీసులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న బీజేపీ మాజీ అధి కార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయతో పాటు మొత్తం ఏడుగురు ఇప్పటికే అరెస్ట య్యారు. కాగా, ఆగస్టు 8న జంతర్ మంతర్ సమీపంలో 'భారత్ జోడో ఆందోళన్' నిర్వహించిన కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాటు ముస్లిం వ్యతిరేక నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా అశ్విని ఉపాధ్యాయ, ప్రీత్ సింగ్, దీపక్ సింగ్, దీపక్ కుమార్, వినోద్ శర్మ, వినీత్ బాజ్పారు, సుశీల్ తివారీలను అరెస్టు చేశారు. ప్రీత్ సింగ్ 'సేవ్ ఇండియా ఫౌండేషన్' డైరెక్టర్‌గా ఉన్నారు.