Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లకు 70 : 30 పద్ధతిలోనే పంపిణీ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది. గత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు జరపలేదనీ లేఖలో తెలిపింది. కృష్ణానది నీటిని 50 : 50 పద్ధతిలో కేటాయించాలని తెలంగాణా లేఖ రాసిన నేపథ్యంలో ఏపీ కూడా బుధవారం కెఆర్‌ఎంబికి లేఖరాసింది. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నై, హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసేందుకు కొన్ని నిబంధనలు విధించారని తెలిపింది. అదే విధంగా నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తికి, సాగునీటి అవసరాలకు ప్రకాశం బ్యారేజీకి నీటివిడదుల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొంది. ఏపీికి 1059 టీిఎంసీిల నీరు అవసరం ఉందని గతంలోనే అనేకసార్లు లేఖ రూపంలో తెలిపినట్లు పేర్కొంది. ఈ సమయంలో 50 : 50 పద్ధతిలో నీటిని పంచాలని కోరటం సరైంది కాదని పేర్కొంది.