Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోం మాజీ ఎమ్మెల్యేకు 25 ఏండ్ల జైలు శిక్ష
- మరో ముగ్గురికి జీవితఖైదు
గువాహతి: మైనర్పై లైంగికదాడికి పాల్పడిన మేఘాలయ మాజీ ఎమ్మెల్యే జూలియన్ డోర్ఫాంగ్కు అక్కడి స్థానిక న్యాయస్థానం 25 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, 15 లక్షల జరిమానాతో పాటు మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకెళ్తే.. డోర్ఫాంగ్ ఎమ్మెల్యేగా ఉన్న 2017లో 14 ఏండ్ల ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అతనిపై పోక్సో చట్టం, అనైతిక అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన డోర్ఫాంగ్ను అసోంలోని గౌహతి శివారు లోని ఓ బస్ టెర్మినల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరో ముగ్గురు దోషులు.. మైనర్ల అక్రమరవాణాకు పాల్పడుతూ.. వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం ఆ ముగ్గురికి జీవితఖైదు, మాజీ ఎమ్మెల్యే డోర్ఫాంగ్కు 25 ఏండ్ల జైలు శిక్ష విధించింది.కాగా, నిషేధిత మిలిటెంట్ గ్రూప్ హిన్నివ్ట్రెప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ మాజీ వ్యవస్థాపకుడైన డోర్ఫాంగ్ 2007లో పోలీసులకు లొంగిపోయాడు. 2013లో రి-భోరు జిల్లా నుండి మావతి అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. తాజా కోర్టు తీర్పును మేఘా లయ హైకోర్టు సవాలు చేస్తామని డోర్ఫాంగ్ లాయర్ వెళ్లడించడం గమనార్హం.