Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫ్ఘన్ పౌరుల రాకపై భారత్
న్యూఢిల్లీ : ఆఫ్ఘన్ పౌరులెవరైనా భారత్‌కు రావొచ్చునని, వారికోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఎలక్ట్రానిక్ వీసా(ఈ-వీసా)లు అందు బాటులో తీసుకొచ్చామని భారత్ ప్రకటించింది. 'ఇండియావీసాఆన్లైన్' వెబ్సైట్లోకి తగిన వివరాలు నమోదుచేసిన వెంటనే ఈవీసా జారీ అవుతుందని కేంద్రం తాజాగా తెలిపింది. ఆఫ్ఘన్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఈ-వీసా ప్రక్రియ చేపట్టామని కేంద్ర హోంశాఖ తాజాగా వెల్లడించింది. ఆఫ్ఘన్లో అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ పౌరులు పెద్ద సంఖ్యలో భారత్‌కు రావాలని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో బుధవారం నుంచి 'ఈ-ఎమెర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా' పేరుతో ఈవీసాలను జారీచేయటం మొదలైంది. ''గతంలో భారత్ వీసాలు పొందిన ఆఫ్ఘన్ పౌరులు, ఇప్పుడు భారత్‌లో లేనట్టయితే..వాటిని రద్దు చేస్తున్నా''మని కేంద్రం తెలిపింది.
ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వశం కావటంతో అక్కడి పౌరులు పెద్ద సంఖ్యలో కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. రోజు రోజుకీ విమానాశ్రయం వద్ద పౌరుల తాకిడి భారీగా పెరుగుతోంది. వీటికి సంబంధించి వీడియో దృశ్యాలు, వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
సైనిక బలగాలు, సిబ్బందిని తరలించేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు భారీ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఒప్పందం ప్రకారం అమెరికా సైనిక బలగాలు, సిబ్బంది, ఆ దేశ పౌరులు ఆగస్టు 31లోగా ఆఫ్ఘన్‌ను విడిచివెళ్లాలి. ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే అవకాశం లేదని అమెరికా భావిస్తోంది. దాంతో మరికొంత సమయం కావాలని తాలిబాన్లను అమెరికా కోరినట్టు తెలిసింది. ఆగస్టు 14 తర్వాత 70వేలమందిని ఆఫ్ఘన్ నుంచి తరలించామని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.