Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ ఎంపీ అతుల్‌రారు లైంగికదాడి చేశాడని ఆరోపణలు
న్యూఢిల్లీ: బీఎస్పీ ఎంపీ అతుల్‌రారు తనపై లైంగికదాడి చేశాడనీ, తనకు న్యాయం చేయాలని కోరుతూ.. గతవారం సుప్రీం కోర్టు ముందు ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ మరణించారు. పోలీసులు వివరాల ప్రకారం.. ఎంపీ అతుల్‌రారు తనపై లైంగికదాడి చేశాడనీ, తనకు న్యాయం చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియా బాద్‌కు చెందిన 24 ఏండ్ల బాధితురాలు.. తన స్నేహితుడితో కలిసి గతవారం సుప్రీంకోర్టు ముందు నిప్పంటించుకున్నారు. ఆ రోజే యువ కుడు చనిపోయాడు. 85 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మంగళవారం మరణించింది. బాధితురాలు.. తనపై ఎంపీ అతుల్ రారు 2019లో లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. అతుల్ రారును అరెస్ట్ చేయగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, ఎంపీకి పోలీసులు సహకరిస్తున్నారని, మరో కేసులో కోర్టు తనకు వారెంటు జారీచేసిందని పేర్కొంటూ స్నేహితుడితో కలిసి సుప్రీంకోర్టు ముందు నిప్పంటించుకు న్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఫేస్ బుక్ లైవ్‌లో వీడియో రికార్డు చేశారు. మరోవైపు, తనకు ప్రాణహాని ఉందనీ, కేసును అలహాబాద్ నుంచి ఢిల్లీ బదిలీ చేయాలని ఈ ఏడాది మార్చిలో ఆ మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, గతేడాది నవంబరులో బీఎస్పీ నేత సోదరుడు మహిళపై ఫోర్జరీ కేసు పెట్టాడు. ఈ కేసులో వారణాసి కోర్టు మహిళ, ఆమె స్నేహితుడికి ఈ నెలలోనే నాన్-బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. ఫేస్బుక్ లైవ్‌లోనూ ఆమె ఈ వారెంటు గురించి ప్రస్తావించారు. ఎంపీ, అతడి బంధువులతో పోలీసులు కుమ్మక్కయి తనకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని వాపోయింది.