Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీమాలో కనీస వాటా చాలు : ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ వెల్లడి
ముంబయి : ప్రభుత్వరంగ సంస్థలను అడ్డ గోలుగా అమాంతం అమ్మడానికి సిద్దం చేస్తూనే.. మరోవైపు అలాంటిదేమీ ఉండదని ప్రభుత్వ వాటా కొనసాగుతుందని బీజేపీ పాలకులు పచ్చి అబద్దా లు చెబుతున్నారు. కీలక రంగాల నుంచి కేంద్ర ప్రభుత్వం వైదొలిగే యోచనలేదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. బ్యాంకింగ్, విత్త సంస్థలు, బీమారంగ తదితర సంస్థల్లోని పూర్తి వాటాలను కేంద్రం వదులుకోవడం లేదని మంత్రి అన్నారు. అలాగని ఆయారంగాల పీఎస్‌యూలు పూర్తిగా తమ స్వాధీనంలో ఉండవని స్పష్టంచేశారు. కనీస ఉనికి మాత్రం కలిగి ఉంటామని వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో మంత్రి సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీమా సహా పలు కీలక రంగాల్లోని ప్రభుత్వరంగ సంస్థల్లో కేంద్రానికి వాటాలు ఉంటాయని ఇటీవల బడ్జెట్లో తమ విధానాన్ని ప్రకటించామన్నారు. ఎల్ఐసీ, సాధారణ బీమా పరిశ్రమలో ప్రభుత్వ ఉనికి ఉంటుందన్నారు. విత్తసంస్థల్లో కనీస ఉనికిని మాత్రమే కలిగి ఉంటామన్నారు. దీంతో పీఎస్‌యూల్లోని గరిష్ట వాటాలను లేదా యాజమాన్య హక్కులను కార్పొరేట్లకు కట్టబెట్టనుందని స్పష్టం అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాదంటూనే పీఎస్‌యూలను ప్రయివేటు శక్తులకు అప్పగిస్తున్నారని అర్థం అవుతుందన్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశంలో మోడీ ప్రభుత్వం బీమా బిల్లు సవరణ చేపట్టింది. ఇందులో ప్రభుత్వ బీమా సంస్థల్లో కనీస వాటా 51 శాతం వాటా ఉండాలనే నిబంధనను ఎత్తేసింది. సాధారణ బీమా కంపెనీలను పూర్తిగా ప్రయివేటుపరం చేయడానికి కేంద్రం ఈ సవరణ చేసిన విషయం తెలిసిందే.
బ్యాంకింగ్ సేవలపై సమీక్షా
స్మార్ట్ బ్యాంకింగ్‌కు బాటలు వేసే ఎన్‌హేన్స్‌డ్ యాక్సెస్ సర్వీస్ ఎక్స్‌లెన్స్(ఈజ్ 4.0)ను మంత్రి సీతారామన్ ప్రారంభించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల వార్షిక సామర్ధ్యం సమీక్షించడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్, కొవిడ్-19 కింద ప్రకటించిన పలు ప్యాకేజ్‌ల అమలుపై తాము సమీక్షించామని మంత్రి తెలిపారు.