Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృత్తివిద్యా కోర్సుల్లో 7.5 శాతం కోటాకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం
చెన్నయ్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తూ తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృత్తివిద్యా కోర్సుల్లో వారికి 7.5 శాతం కోటా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటన్నరీ, ఫిషరీస్, లా, యూనివర్సిటీలు, ప్రైవేటు కళాశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రభుత్వ కాలేజ్‌లు ఆఫర్ చేసే ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వృత్తి విద్యా కోర్సుల సీట్లలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5 శాతం సీట్లు కేటాయించనున్నారు. విద్యార్థులు రాష్ట్రంలోనే ఆరు నుంచి పన్నెండు తరగతుల వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకొని ఉండాలని బిల్లు పేర్కొంది. అయితే ఈ రిజర్వేషన్ డీమ్డ్ యూనివర్సిటీల విషయంలో వర్తించదని రాష్ట్ర విదాశాఖ మంత్రి కె.పొనుముడి తెలిపారు. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థుల మధ్య నిజమైన సమానత్వాన్ని తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయించిందని అన్నారు. జస్టిస్ డి.మురుగేషన్ కమిషన్ సమర్పించిన నివేదిక ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థుల మధ్య అసమానతలను స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. సామాజిక-ఆర్థిక పరిస్థితి ప్రతికూలత, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గత నమోదును పరిగణనలోకి తీసుకొని వృత్తి విద్యా కోర్సులలో 10 శాతం లోపు సీట్లు కేటాయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. 'రాష్ట్రంలో అమలులో ఉన్న రిజర్వేషన్ నియమాన్ని ప్రభావితం చేయకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రాధాన్యత ఉండాలని పేర్కొంది.