Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం:భూ వ్యవహారంలో రైతు నుంచి రూ.11 వేలు లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ ఎసిబి అధికారులకు గురువారం పట్టుబడ్డారు. ఎసిబి డిఎస్పి రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా పద్మనాభం మండలం బాందేవుపురం గ్రామానికి చెందిన ఎం.రాము నాయుడు తన తండ్రికి చెందిన భూమిని సర్వే చేయాలని జులైలో గ్రామ సచివాలయంలో దర ఖాస్తు చేసుకున్నాడు. ఆ పని చేసేందుకు మండల సర్వేయర్ ఉపేంద్ర రూ.18 వేలు డిమాండ్ చేశారు.