Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండపై సీబీఐ తొమ్మిది కేసులు నమోదు చేసింది. ఈ హింసాకాండపై దర్యాప్తు నిర్వహించాలని ఈ నెల ప్రారంభంలో సీబీఐను కోల్కత్తా హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులను దర్యాప్తు చేయడానికి నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. అలాగే బాధితుల వాంగూల్మం రికార్డు చేయనున్నట్టు చెప్పారు. బెంగాల్ పోలీసులు ఇచ్చిన సమాచారం అధారంగా మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశముందని అధికారి వెల్లడించారు.