Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం: విశాఖ జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న అడ్మిరన్ లైఫ్ సైన్సెస్ మందుల పరిశ్రమ నుంచి గురువారం ఫ్లోరో సల్ఫో ఫోనిక్ విష వాయువు లీకైంది. దీంతో పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు, సమీప గ్రామాల ప్రజలు భయాందోళనతో పరు గులు తీశారు. కళ్ల మంటలు, శ్వాస సమస్యలు, ఒళ్లంతా దురదలు రావడంతో ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయమూ కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చు కున్నారు. పరిశ్రమ యాజమాన్యం బాయిలర్ మెయింటినెన్స్ చేయకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. విష వాయువు లీకు విషయం తెలుసుకున్న విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్, తహశీల్దార్ బివి.రాణి, రెవెన్యూ సిబ్బంది ఘటన పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నివేదిక తయారు చేసి జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. విష వాయువుల లీకేజికి కారణమైన అడ్మిరన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు, జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.