Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం కరోనా రెండో దశ కొనసాగుతోందని కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్, అక్టోబర్ల్లో అనేక పండుగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని తెలిపింది. ప్రజలంతా తగిన జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం దేశం కరోనా రెండో దశల మధ్య లో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం తెలి పారు. కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లా డారు. వ్యాక్సిన్లు వ్యాధి నుంచి రక్షణ మాత్రమే కల్పిస్తాయని, అందువల్ల వ్యాక్సినే షన్ తర్వాతా ప్రతిఒక్కరూ మాస్క్లు తప్పనిసరిగా వాడాలని విజ్ఞప్తి చేశారు.
గంటలో లక్ష మందికి టీకాలు : మధ్యప్రదేశ్లో రికార్డు
దేశంలో ఇప్పటి వరకు 60 కోట్ల 38 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే 80,40,407 మంది టీకా వేయించుకున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త రికార్డును నెలకొల్పింది. 24గంటల వ్యవధిలో 24.20 లక్షల మందికి టీకాలు వేశారు. అంటే గంటకు దాదాపు లక్ష డోసులకు పైగా పంపిణీ చేశారు. రెండు రోజుల పాటు చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా బుధవారం తమ ప్రభుత్వం ఈ రికార్డు నెలకొల్పినట్టు మధ్యప్రదేశ్ వైద్యశాఖ ట్విటర్లో వెల్లడించింది. రెండో డోసు పెండింగ్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని ఈ క్యాంపెయిన్ నిర్వహించినట్టు ్ట రాష్ట్ర వ్యాక్సినేషన్ అదనపు డైరెక్టర్ డాక్టర్ సంతోష్ శుక్లా వెల్లడించారు.