Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలోని జాతీయ ఆస్తులను దేశ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల యూనియన్ (బీఎస్ఎన్ఎల్ఈయూ) నిరసనలు నిర్వహించనుంది. 26 వేల కిలోమీటర్ల హైవేలను, 400 రైల్వే స్టేషన్లు, 150 ట్రైన్లు, 8 వేల కిలోమీటర్లు జాతీయ గ్యాస్ పైప్ లైన్లు, 14 వేలకు పైగా బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ టవర్లు, 21 విమానాశ్రయాలు, 31 నౌకాశ్రయాలు, 160 కోల్ మైనింగ్ ప్రాజెక్టులు, 2 క్రీడా మైదానాలతో సహా ఇంకా అనేక జాతీయ ఆస్తులను దేశ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని బీఎస్ఎన్ఎల్ఈయూ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 'నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్' పేరుతో జాతీయ ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించడాన్ని వెంటనే నిలిపివేయాలని యూనియన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం లంచ్ టైమ్లో దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.