Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాధీనానికి కార్పొరేట్ల వరుస
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) స్వాధీనానికి గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలు వరుస కడుతున్నాయి. దేశంలోనే మూడో అతిపెద్ద చమురు సంస్థ అయినా ఈ నవరత్న కంపెనీని మోడీ సర్కార్ అంగట్లో అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. అపారకుబేరుడు అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూపు, అమెరికాకు చెందిన అపోలో గ్లోబల్, ఐ స్వేక్డ్ కాపిటల్ గతేడాది ఈ సంస్థ కొనుగోలుకు ప్రాథమిక బిడ్లను కూడా సమర్పించాయి. బీపీసీఎల్ కొనుగోలుకు సంబంధించి బిడ్డర్లు సెక్యూరిటీ క్లియరెన్స్ సమర్పించాల్సి ఉందని అసెట్ వాల్యూ అండ్ ట్రాన్స్క్షన్ అడ్వైజర్ ఓ డాక్యూమెంట్‌లో తెలిపింది. ఇతర ఆసక్తి కలిగిన సంస్థలు బిడ్డింగ్ ప్రాసెస్‌లో పాల్గొనవచ్చని పేర్కొంది. ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ సహా రాయల్ డచ్ సెల్,బీపీ, ఎక్సాన్ తదితర గ్లోబల్ చమురు దిగ్గజాలు బీపీసీఎల్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని తొలుత రిపోర్టులు వచ్చాయి. మధ్య ఈశాన్య ప్రాంతంలోని ఓ దిగ్గజ చమురు కంపెనీ బీపీస ీఎల్ స్వాధీనంపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ఉక్కు వ్యాపార దిగ్గజం లక్ష్మీ మిట్టల్ కూడా ఆసక్తి కనబర్చిన విషయం తెలిసిందే. తాజాగా ఫైనాన్సీ యల్ బిడ్లను అహ్వానిస్తున్నట్లు అసెట్ వల్యూర్ అండ్ ట్రాన్స్క్షన్ అడ్వైజర్ రిపోర్ట్ పేర్కొంది. కనీస రిజర్వు ధరను ఫిక్స్ చేయగా.. అధిక ధరకు కోడ్ చేసిన కంపెనీకి బిపిసిఎల్‌ను అప్పగించనున్నారు. బీపీసీఎల్ ను విదేశీ కంపెనీలకు కట్టబెట్టడానికి ఈ రంగ పీఎస్‌యూల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లకు అనుమతిస్తూ కేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వ చమురు, గ్యాస్ రంగం కంపెనీల్లో 49 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. బీపీసీఎల్‌లోని ప్రభుత్వానికి ఉన్న 53 శాతం వాటాను 2022 మార్చి ముగింపు నాటికి విక్రయించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నది.