Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ లక్ష్మయ్య
కడప : పెరుగుతున్న ఇంధన ధరలు, రోడ్డు ట్యాక్స్, థర్డ్‌పార్టీ ఇన్యూరెన్సుతో రవాణా రంగం కుదేలవుతుందని ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో రవాణారంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలో డీజిల్‌పై రూ.16, పెట్రోల్‌పై రూ.13 ఎక్సైజ్ డ్యూటీ పెంచిందన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం, టోల్గేట్ భారాలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. ఫలితంగా రవాణా రంగంలో 65 శాతం వాహనాలు మాత్రమే రోడ్డుపై తిరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 35 సార్లు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిందన్నారు. రవాణా రంగాన్ని స్వదేశీ, విదేశాల్లో ఉండే అతిపెద్ద కంపెనీలకు అప్పగించడం కోసమే కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్ట సవరణను తీసుకుకొచ్చిందన్నారు. ఈ క్రమంలో ఈ నెల 29న విజయవాడలో నిర్వహించే జాతీయ వర్కింగ్ కమిటీ సమావే శాల్లో రవాణా రంగం రక్షణ కోసం ఏమి చేయాలనే దానిపై చర్చించ బోతున్నట్లు చెప్పారు. దేశంలోని చాలా ఆర్‌టిసిలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని, కార్మికులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాయన్నారు. వీటిని పరిరక్షించేందుకు ఢిల్లీలో జాతీయ సెమినార్ నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. రవాణా రంగ పరిరక్షణకు, ఆర్టిసిని కాపాడేందుకు, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ చట్టం కోసం పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.