Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ సీపీఐ(ఏం) రాష్ట్ర కమిటీ
అమరావతి :గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాలను అదానీ కంపెనీకి రూ.644 కోట్లకు పూర్తిగా అమ్మడాన్ని సీపీఐ(ఏం) రాష్ట్ర కమిటీ వ్యతిరేకించింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పోర్టు వాటాలు అమ్మడం అంటే విశాఖ స్టీల్ ప్లాంటు, రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం చేయడమేనని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మెడపై మోడీ ప్రభుత్వం కత్తిపెట్టి మరీ వాటాలను అదానీ కంపెనీకి అమ్మేందుకు ఒత్తిడి తెచ్చిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గడం శోచనీయమని పేర్కొన్నారు. గతంలో కృష్ణపట్నం పోర్టును నవయుగ కంపెనీ నుండి బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు.ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన తరువాత రాష్ట్రంలో ప్రధాన ఓడరేవుల నుండి జరిగే ఎగుమతులు జలరవాణా ఛార్జీలు విపరీతంగా పెంచుతారని తెలిపారు. గంగ వరం పోర్టులో అదానీ యాజమాన్యం సున్నపురాయి ధరలు భారీగా పెంచిందని, దీనివల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం వాటా శాశ్వతంగా కోల్పోతామని, ఆర్థికంగానూ నష్టం జరుగుతుందని వివరించారు. దేశంలో విశాఖ పోర్టుతో సహా మైనర్ పోర్టులు, మేజర్ పోర్టులను అశ్రిత పెట్టుబడిదారుల పరం చేసేందుకు, దేశంలోని పోర్టులను అదానీ కంపెనీకి అప్పగించేందుకే పోర్టు చట్టాన్ని సవరించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గంగవరం పోర్టు వాటాలను అమ్మాలని తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని మధు డిమాండు చేశారు.
కృష్ణా జలాల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి
సున్నితమైన నదీజలాల పంపిణీ సమస్యను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యంగా చర్చించు కుని పరిష్కరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది.ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల రీత్యా ఈ దిశగా కృషి చేయాలని గతంలోనే తమ పార్టీ విజ్ఞప్తి చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు.ఈ విషయంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరపాలని మధు కోరారు.