Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ పెరుగుతున్న కేసులు..
- మరణాలు
- ప్రపంచవ్యాప్తగా 21.39 కోట్లకుపైనే..44.64లక్షలకుపైగా మరణాలు
- భారత్‌లో ఒక్కరోజే 46వేల మందికిపైనే పాజిటివ్..607 మంది మృతి
- దేశంలో కోవిడ్ -19 సోకిన వారి సంఖ్య 3,25,58,530
న్యూఢిల్లీ : రెండు వేవ్‌లను ఎదుర్కొన్నాం కదా..థర్డ్‌వేవ్‌తో ముప్పులేదని జనం అనుకుంటున్నారో..లేక నిర్లక్ష్యమో కానీ..మొత్తానికి మళ్లీ కరోనా పంజా విసురుతున్నది. భౌతికదూరం,మాస్క్‌లు ధరించకపోవటం లాంటి కారణాలతో కేసులు,మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 21.39 కోట్లకు కోవిడ్..19 కేసులు చేరగా..44.64 లక్షలకుపైగా కరోనా కోరల్లోపడి చనిపోయారు. ఇక భారత్‌లోనూ తగ్గినట్టు తగ్గి ..ఒక్కరోజే 46వేలమందికి పైనే పాజిటివ్ కేసులు గుర్తించగా..607 మంది మరణించారు. గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. దేశంలో కోవిడ్ -19 సోకిన వారి సంఖ్య 3,25,58,530కి చేరింది. ఇప్పటివరకు చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 3,33,725 కి పెరిగింది.
థర్డ్‌వేవ్ గురించి వైద్యనిపుణులు హెచ్చరిక చేస్తున్నా..జనం మాత్రం పట్టించుకోవటంలేదు. ఇలాంటి నిర్లక్ష్యమే మరిన్ని ప్రాణాలకు ముప్పు తప్పదనీ వైద్యులు సూచిస్తున్నారు.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా విడుదల చేసిన డేటా ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 21,39,37,377 కి పెరిగాయి. ఇప్పటివరకు 44,64,245 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం భారత్‌లో 3,33,725 మంది కరోనా వైరస్ సంక్రమించగా.. చికిత్స పొందుతున్నారు, ఇది మొత్తం కేసులలో 1.03 శాతం. గత 24 గంటల్లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్యలో మొత్తం 11,398 పెరుగుదల నమోదైంది. రోగుల రికవరీ జాతీయ రేటు 97.63 శాతం.
డేటా ప్రకారం, దేశంలో కోవిడ్ -19 కోసం ఇప్పటివరకు మొత్తం 51,31,29,378 నమూనాలను పరీక్షించగా, అందులో 17,87,283 నమూనాలను బుధవారం పరీక్షించారు. రోజువారీ సంక్రమణ రేటు 2.58 శాతం, ఇది గత 31 రోజులలో మూడు శాతం కంటే తక్కువ.
అదే సమయంలో వీక్లీ ఇన్ఫెక్షన్ రేటు 2.02 శాతం, ఇది గత 62 రోజులలో మూడు శాతం కంటే తక్కువ. దేశంలో ఇప్పటివరకు 3,17,88,440 మంది కోలుకున్నారు . కోవిడ్ -19 మరణాల రేటు 1.34 శాతం.గురువారం ఉదయం వరకు దేశంలో మొత్తం 60.38 కోట్ల యాంటీ-కోవిడ్ -19 టీకాలు ఇవ్వబడ్డాయి.
డేటా ప్రకారం దేశంలో గత 24 గంటల్లో కరోనాతో మరణించిన 607 మందిలో మహారాష్ట్ర నుంచి 216 మంది, కేరళ నుంచి 215 మంది ఉన్నారు.
మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు సంక్రమణ కారణంగా మొత్తం 4,36,365 మంది మరణించారు, వీరిలో మహారాష్ట్రలో 1,36,571, కర్నాటకలో 37,206, తమిళనాడులో 34,788, ఢిల్లీలో 25,080, ఉత్తరప్రదేశ్‌లో 22,794 , కేరళలో 19,972., పశ్చిమ బెంగాల్ నుంచి 18,393 మంది ఉన్నారు.
అయితే మరణించిన వారిలో 70 శాతానికి పైగా రోగులకు ఇతర వ్యాధులు కూడా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్ ) డేటాతో పోల్చిన వివరాలను మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో తెలిపింది.
ఆ వివరాల ప్రకారం..దేశంలో 110 రోజుల్లో కోవిడ్ -19 కేసులు లక్ష నమోదుకాగా..కేవంల 59 రోజుల్లో అవి 10 లక్షలు దాటిపోయాయి.