Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫ్ఘనిస్తాన్పై అఖిలపక్షంలో ప్రతిపక్షాలు
- భారత్ ఏకాకి కాకుడదు ొ దౌత్యంలో ఘోరంగా విఫలం
- అమెరికాను నమ్ముకుంటే అంతే సంగతి
- సాధ్యమైనంత ఎక్కువ మందిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం : జైశంకర్, కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : ఆలస్యం చేయొద్దనీ, చర్యలు వేగ వంతం చేయాలని ప్రతిపక్షాలు కోరాయి. అలాగే అఫ్ఘనిస్తాన్ దౌత్యం విషయంలో ఘోరంగా విఫలం అయ్యామని విమర్శించాయి. భారత్ ఏకాకి కాకూడదనీ, అక్కడి వేల కోట్ల పెట్టు బడులు ఉన్నాయని సూచించాయి. అఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పార్లమెంట్‌లోని ఎనెక్స్ భవన్లో గురువారం అఖిల పక్షం జరిగింది. ఈ సమావేశంలో 31 పార్టీల నుంచి 37 మంది నేతలు పాల్గొన్నారు. దాదాపు మూడున్నర గంటలసేపు జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రి పియూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి. మురళీధరన్ పాల్గొన్నారు. అలాగే ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు కేంద్రమంత్రి పసుపతి కుమార్ పరాస్ (ఎల్జేపీ), కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ (అప్నాదళ్), రామ్‌దాస్ అథ్వాలే (ఆర్పీఐ), రాజీవ్ రంజాన్ సింగ్ (జేడీయూ), నవనీత కష్ణన్, పి. రవీంద్ర నాథ్ (అన్నాడీఎంకే) హాజరయ్యారు. ప్రతిపక్షాల నుంచి మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ (జేడీఎస్), మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, ఆనంద్ శర్మ (కాంగ్రెస్), శరద్ పవర్ (ఎన్సీపీ), టిఆర్ బాలు, తిరుచ్చి శివ (డీఎంకే), సౌగత్ రారు, సుకేందు శేఖర్ రారు (టీఎంసీ), పి.ఆర్ నటరాజన్ (సీపీఐ(ఎం), బినరు విశ్వం (సీపీఐ), మిథున్ రెడ్డి (వైసీపీ), గల్లా జయదేవ్ (టీడీపీ), నామా నాగేశ్వర రావు(టీఆర్ఎస్), ప్రసన్న ఆచార్య (జేడీయూ), విషంభర్ ప్రసాద్ నిషాద్ (ఎస్పీ), రితీష్ పాండే (బీఎస్పీ), ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ (ఆర్ఎస్పీ), శ్రేయమ్స్ కుమార్ (ఎల్జేడీ), మసూది హస్నైన్ (ఎన్సీ), అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం), చాజికడన్ థామస్ (కేసీఎం) తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆప్ఘనిస్థాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష ష్రింగ్లే కూడా హాజరయ్యారు.
సమావేశం ప్రారంభమైన వెంటనే విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష ష్రింగ్లే పూర్తి వివరాలతో కూడిన ప్రెజింటేషన్ ఇచ్చారు. అలాగే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వివిధ అంశాలపై ప్రసంగించారు. ఇప్పటి వరకు 565 మందిని భారత్‌కు రప్పించామనీ, అందులో 175 మంది రాయబార కార్యాలయ సిబ్బంది, 263 మంది ఇతర భారతీయ పౌరులు, హిందువులు, సిక్కులతో సహా 112 మంది ఆఫ్ఘన్ పౌరులను, 15 మంది మూడో దేశ పౌరులను రప్పించినట్టు ప్రభుత్వం సమావేశంలో తెలిపింది. అనంతరం అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ, తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు వివిధ అంశాలను లేవనెత్తాయి. అక్కడి వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించాయి. భారతీయుల తరలింపును వేగవంతం చేయాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ దేశంలో గల సంబంధాలపై ప్రశ్నించాయి. అన్ని పార్టీలు జాతీయ ఐక్యతతో దాదాపు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.అనంతరం కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ బహిష్కరణకు గురైన మహిళా దౌత్యవేత్త సమస్యను లేవనెత్తామనీ. ఇలాంటివి మళ్లీ జరగవనీ, ఈ విషయాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వం చెప్పినట్టు తెలిపారు. 'ప్రజల, దేశ ప్రయోజనాల కోసం మేం కలిసి పనిచేయాలి. వేచి చూడమని ప్రభుత్వం మాకు చెప్పింది'' అని ఖర్గే అన్నారు.
భారత్ ఒంటరికావద్దు : పిఆర్ నటరాజన్, సీపీఐ(ఎం)
ఆఫ్ఘనిస్తాన్ విషయంలో దౌత్యం పూర్తిగా విఫలమైందనీ, భారత్ ఒంటరి కావద్దని సీపీఐ(ఎం) లోక్‌సభ పక్షనేత పిఆర్ నటరాజన్ అన్నారు. ఆలస్యం చేయకుండా భారతీయులను తరలించాలని డిమాండ్ చేశారు. అమెరికా ఎన్నికల సమయంలోనే జో బైడెన్ అఫ్ఘనిస్తాన్‌లో తమ భద్రతా బలగాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించారని గుర్తు చేశారు. అయితే సెప్టెంబర్ 11న ఉపసంహరణ చేస్తామని ప్రకటించారని, కానీ అంతకంటే ముందే ఆగస్టు 31 నాటికే బలగాలను ఉపసంహరించుకోవడం దారుణమని అన్నారు. అమెరికాకు ప్రాథమిక భాగస్వామిగా భారత్ ఉందనీ, అయితే అమెరికా ముందస్తుగా బలగాల ఉపసంహరణ గురించి భారత్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రజల తరలింపును ఆగస్టు 31 నాటికి తాలిబన్లు అపుతారని, సమయం కూడా చాలా తక్కువ ఉందని తెలిపారు. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికీ సుమారు 500పైగా పౌరులను మాత్రమే తీసుకొచ్చారని, 15 వేల మంది ఇంకా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నారని తెలిపారు. ఈ తక్కువ సమయంలో వారిని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించారు. అక్కడ వేల కోట్ల విలువ చేసే 500పైగా ప్రభుత్వ, ప్రయివేట్ ప్రాజెక్టులు ఉన్నాయనీ, వాటిపై నమ్మకాన్ని ఎలా ఇవ్వగలుగుతారని అన్నారు. తాలిబన్లతో అమెరికా రహస్య ఒప్పందం కుదర్చుకుందనీ, అలాంటప్పుడు భారత్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. భారత్‌కు రష్యా, ఇరాక్‌లకు వాస్తవ భాగస్వాములనీ, ఆ రెండు దేశాలు తాలిబన్లకు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఒంటరి అయిందని అన్నారు. సీపీఐ ఎంపీ బినరు విశ్వం మాట్లాడుతూ తాము లేవనెత్తి అంశాలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని అన్నారు. విదేశాంగ విధానాలతో కలిపి కేంద్ర ప్రభుత్వ విధానాలు, అమెరికా విధానాలను అనుసరించి ఉన్నాయనీ, ఇదే పెద్ద సమస్య అని తెలిపారు. భారత సార్వభౌమాధికారం కలిగి భారత్, అమెరికా విధానాల నుంచి బయటకు రావాలని కోరారు. అఫ్ఘనిస్తాన్ భారత్‌కు చాలా ముఖ్యమైన దేశమనీ, దేశం రక్షణ, భద్రత కోసం ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని : నామా నాగేశ్వరరావు, టీఆర్ఎస్
కేంద్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో టీఆర్ఎస్ ఎప్పుడూ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుందన్నారు. దేశ పౌరులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. ప్రభుత్వం తీసుకునే చర్యల పట్ల రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించామని అన్నారు.