Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల తీరు ఇబ్బందికరం
- కేసుల నమోదులో పోలీసు శాఖ బాధ్యతగా వ్యవహరించాలి : సీజేఐ
న్యూఢిల్లీ : కొందరు పోలీసుల తీరు ఇబ్బందికరంగా మారిందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. పలు రాష్ట్రాల్లో అధికార పార్టీ సూచించినట్టుగానే దర్యాప్తు చేపడుతు న్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. సస్పెండైన ఐపీఎస్ అధికారి గుర్జిందర్ పాల్ సింగ్‌పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రాజద్రోహంతో పాటు పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రత్యర్థులను అధికారపార్టీ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల నమోదులో పోలీసు శాఖ బాధ్యతగా వ్యవహరించాలనీ, వారి తీరు ఇబ్బందికర సంప్రదాయంగా మారిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరించడం కలవరపెట్టే ధోరణి.. ఇలాంటి సంప్రదాయానికి తెరపడాల్సిన అవసరం ఉందని అన్నారు. పలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీ నేతలు తమ పదవిని నిలుపుకునేందుకు దేనికైనా సిద్ధపడుతున్నారని చెప్పారు. కొందరు పోలీసు అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.