Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ సర్కార్ విజ్ఞప్తికి ఎన్జీటీ అనుమతి
న్యూఢిల్లీ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పర్యావరణ ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్ల్లో ఇంప్లీడ్ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం అనుమతించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారంటూ కోస్గి వెంకటయ్య దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతున్నదని ఏపీ ప్రభుత్వం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన తనిఖీ కమిటీ నివేదిక దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. నోడల్ ఏజెన్సీగా ఉన్న తెలంగాణ గనుల విభాగాన్ని తప్పించి కృష్ణా బోర్డును నోడల్ ఏజెన్సీగా నియమించింది. పర్యావరణ ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా అనే అంశంపై కేంద్ర పర్యావరణ శాఖ త్వరగా నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబరు 22కు వాయిదా వేసింది..