Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు ఆర్కె సింగ్ లేఖ
న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ కోరారు. ఈ మేరకు శుక్ర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు, కేందర మంత్రులకు ఆర్కె సింగ్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సరికొత్త 'ట్రాన్స్ఫర్మెటివ్ మొబిలిటీ' చొరవలో భాగస్వామ్యం కావాలని కోరారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు తమ అధికారిక వాహనాల సముదాయాన్ని ప్రస్తుత ఉన్న అంతర్గత దహన యంత్రం (ఐసీఈ), పెట్రోల్, డీజిల్ వాహనాల నుండి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవాలని సూచించారు. ఇకపై ప్రభుత్వపు అన్ని అధికారిక ప్రయోజనాల కోసం ఈ తరహా వాహనాలను వినియోగించేలా చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు. ఈ-మొబిలిటీకి మారడానికి ఈ చర్య ఎంతగానో ప్రోత్సహకరంగా నిలుస్తుందని తాము భావిస్తున్నామని మంత్రి తెలిపారు. బహుళ లక్ష్యాలను చేరుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలు) ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ-ఎలక్ట్రిక్ క్యాంపెయిన్లో భాగంగా ఈ చొరవ నిలుస్తుందని అన్నారు. కర్బన్ ఉద్గారాల తగ్గింపు, ఇంధన భద్రత, ఇంధన సామర్థ్యం పెంపు మొదలైన లక్ష్యాలను సాధించేందుకు గాను ఈ చర్య ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు..