Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాతాళానికి పడిపోయిన ధరలు.. టమాట రైతు గోస
- రోడ్డు మీదే పంటను పారబోసిన మహారాష్ట్ర రైతులు
ముంబయి : మహారాష్ట్రలో టమాట రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. మార్కెట్లో టమాట ధరలు పడిపోవడంతో పెట్టిన పెట్టుబడికి లాభాలు రావడం లేదు. కిలో ఒక్కింటికి 25పైసలకు పడిపోయింది. దీంతో రైతులు తాము పండించిన పంట ఉత్పత్తిని రోడ్ల మీదే పోసి తమ నిరసనను తెలిపారు. నాసిక్‌లోని నిపాడ్లో గల వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) కార్యాలయం ముందు ఒక రైతు తీవ్ర ఆగ్రహంతో తాను పండిం చిన టమాట పంట ఉత్పత్తిని పారబోసి వెళ్లాడు. ''టమాట ధరలు దారుణం గా పడిపోయాయి. 20 కేజీల టమాట ధర రూ.5 కు పడిపోతే మాకేం లాభం. రైతులు కనీసం విత్తనాలు పొందడం కూడా కష్టంగా మారింది. అన్న దాతలకు లక్షల రూపాయాల్లో నష్టం ఏర్పడింది. ధరలు దారుణంగా పడిపో యాయి. ప్రతి ఏడాదీ ఇదే తంతు'' అని సదరు రైతు అంకూశ్ ఆవేదనతో తెలిపారు. ఈ సీజన్లో మహారాష్ట్రలో టమాట రైతులు తీవ్రంగా నష్టపోయా రని వ్యవసాయ నిపుణులు వెల్లడించారు. నిపాడ్, ఖేడ్, పంధార్పూర్ ఇలా మహారాష్ట్రలో ఎక్కడ చూసినా టమాట ధరలు దారుణంగా పడిపోయా యనీ, 20 కేజీల టమాట కేవలం రూ.5 నుంచి 7లు పలుకుతోందని చెప్పారు.