Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందజేసిన కృష్ణా బోర్డు
న్యూఢిల్లీ : రాయలసీమ ఎత్తిపోతల పథకం తనిఖీ చేసిన నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనానికి కృష్ణా బోర్డు అందజేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడుతూ ఏపీ ప్రభుత్వం ధిక్కరణకు పాల్పడుతోం దంటూ తెలంగాణ ప్రభుత్వం, గవినోళ్ల శ్రీనివాస్‌లు దాఖలు చేసిన పిటిషన్లు శుక్రవారం జస్టిస్ రామకృష్ణన్, విషయనిపుణుడు సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ధర్మాసనం నివేదికను పరిశీలించి ఆదేశాల్లో పొందుపరుస్తామని పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి షార్ట్రిప్ల్కె ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది. అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణ సెప్టెంబరు 8కి వాయిదా వేసింది.