Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్లో మైనార్టీలపై కొనసాగుతున్న దాడులు
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లో మతపరమైన దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. ఏదో ఒక కారణంతో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ముస్లింలపై దాడిచేయటం నిత్యం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో దాడి ఘటన దివాస్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆధార్ కార్డు చూపించలేదని ఇంటింటికీ తిరిగి బిస్కట్లు అమ్ముకునే ఒక ముస్లింపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. హిందువుల ఏరియాలో బిస్కెట్స్ అమ్ముతావా? ఇంకోసారి గ్రామంలో అడుగుపెడితే ప్రాణాలు తీస్తామని...వారు బెదిరించారని, తీవ్రమైన పదజాలంతో దూషించారని బాధితుడు జాహిద్ఖాన్ (45) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తన దగ్గరున్న రూ.900లను లాక్కున్నారని చెప్పాడు. బెల్టుతో, కర్రతో తీవ్రంగా కొట్టారని..గాయాలను చూపించాడు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశామని హాత్పైప్లియా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.