Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాశ్మీర్‌కు చెందిన నలుగురు జర్నలిస్టుల నిర్బంధంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణులు స్పందించారు. వారిని నిర్బంధించడానికి వెనక గల కారణాన్ని ప్రశ్నిస్తూ వారు భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అలాగే, కాశ్మీర్ టైమ్స్ కార్యాలయం మూసివేత పైనా వారు ప్రశ్నించారు. నిర్బంధంలో ఉన్న నలుగురు జర్నలిస్టులు ఫహాద్ షా, అక్విబ్ జావీద్, సజర్ గుల్, క్వాజీ శిబ్లీ ల నిర్బంధంపై నిపుణులు ఇరేనే ఖాన్, ఎలినా స్టేయినేర్టేలు లేఖలో తమ ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను అన్యాయంగా నిర్బంధించటంపై కేంద్రం వివరణ ఇవ్వాలని లేఖలో కోరారు.