Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టులో తరిగామి పిటిషన్
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370పై సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎంవై తరిగామి.. భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్టికల్ 370, 35(ఏ) లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన రిట్ పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తరిగామితో పాటు అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైన విషయం విదితమే. న్యాయం జరిగే విషయంలో ఈ పిటిషన్‌ను త్వరగా విచారించాలంటూ నాయస్థానాన్ని ఆయన కోరారు. ఒకవేళ దీనిపై త్వరగా విచారణ జరపకపోతే అది 'తీవ్ర అన్యాయానికి కారణమ'వుతుందని వివరిం చారు. ఆగష్టు 5, 2019లో కేంద్రం ఆదేశాల విష యంలో రాజ్యాంగబద్దతను సవాలు చేసినప్పటికీ మోడీ ప్రభుత్వం 'తిరుగులేని చర్యల'ను తీసుకు న్నదని ఆయన పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని ప్రాంతీయ పార్టీల కూటమి అయిన పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ)కి ప్రతినిధిగా తరిగామి ఉన్నారు.