Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అయోధ్య : రాముడు లేకపోతే అయోధ్య.. అయోధ్యే కాదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. ఆదివారం అయోధ్యలో పర్యటించిన ఆయన పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయణ్ కాన్క్లేవ్ను కోవింద్ ప్రారంభించారు. 'శ్రీరాముడి కారణంగానే అయోధ్య ఉనికిలో ఉందని, ఈ నగరంలో రాముడు శాశ్వతంగా నివసిస్తాడని, అందువల్లే ఇది అయోధ్య అయిందని ఆయన చెప్పుకొచ్చారు. రామకథ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ అనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్ పాల్గొన్నారు.