Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో 75 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన 'ఆజాదీ మహౌత్సవ్ పోస్టర్'లో నెహ్రూ ఫోటోను పెడతామని ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) వెల్లడించింది. అయితే, ఐసీహెచ్ఆర్.. దేశ తొలి ప్రధాని అయిన నెహ్రూ ఫోటోను కావాలనే పోస్టర్లో పెట్టలేదని ఇటు కాంగ్రెస్ నాయకులు, అటు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదంపై ఐసీహెచ్ఆర్ స్పందించింది. రాబోయే పోస్టర్లలో నెహ్రూ ఫోటో కనబడుతుందని వివరించింది.కాగా,ఐసీహెచ్ఆర్ ఏర్పాటు చేసిన పోస్టర్లో మహాత్మా గాంధీ, సుభాశ్ చంద్రబోస్, వీడీ సావర్కర్ లతో పాటు పలువురి ఫోటోలు ఉండి నెహ్రూ ఫోటో మాత్రం లేకపోవడం గమనార్హం. '' మేము 'ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్' తొలి పోస్టర్ను మాత్రమే విడుదల చేశాం.ఇంకా అనేక పోస్టర్లు విడుదల చేయాల్సి ఉన్నది. దీనిపై ఒక టీం పని చేస్తున్నది''అని ఐసీహెచ్ఆర్ డైరెక్టర్ ఓమ్జీ ఉపాధ్యారు తెలిపారు.