Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ సీఎం విజయన్
తిరువనంతపురం : రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ తీసుకునే విషయంలో దాదాపు తొమ్మిది లక్షల మంది అయిష్టతను చూపారని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. వీరిలో 60 ఏండ్లు పైబడినవారు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు. అయితే, వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్ ఉంటుందన్న భయమే వారిని టీకా తీసుకోకుండా వెనకడుగు వేసేలా చేసిందని సీఎం చెప్పారు. '' వ్యాక్సిన్ తీసుకునేలా వారిని తయారు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అతి త్వరగా వారికి వ్యాక్సిన్ రక్షణ ఇచ్చేలా చేస్తున్నది. అయినప్పటికీ, చాలా మంది వ్యాక్సిన్ తీసుకునే విషయంలో ఇష్టాన్ని చూపడంలేదు. ఇది తీవ్రంగా పరిగణించే అంశం'' అని సీఎం వివరించారు.