Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి
గౌహతి : అస్సాంలో గౌల్పరా జిల్లాలో శనివారం రాత్రి ఇద్దర్ని దొంగలుగా ఆరోపిస్తూ పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. రాష్ట్రంలో మే నెల నుంచి ఇలాంటి తరహా ఎన్కౌంటర్లు జరగడం ఇది 13వ సారి. మొత్తం 23 మందిని నేరస్తులుగా ఆరోపిస్తూ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. రాష్ట్ర డిజిపి భాస్కర్ జ్యోతి మహంతా వివరాలు ప్రకారం... శనివారం రాత్రి లాఖిపూర్, అగియా ప్రాంతాల మధ్య ఒక కారు పోలీసుల బారికేడ్లను దాటుకుంటు వెళ్లడానికి ప్రయత్నించింది. కారులో ఉన్న నలుగురు పోలీసులపైకి కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపి ఇద్దరిని హతమర్చారు. మరణించినవారిని రాఫజుద్దీన్, బసిత్ అలీగా గుర్తించారు. రషీదుల్లా ఇస్లామ్ అనే వ్యక్తి గాయపడినట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ బాధ్యతలు తీసుకున్న 13 రోజులు తరువాత అంటే, మే 23న ఈ విధమైన ఎన్కౌంటర్ తొలిసారిగా జరిగింది. తరువాత నుంచి ఇది 13వ ఎన్కౌంటర్