Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లూసియానా, మిస్సిసిపిల్లో అత్యవసర పరిస్థితి
న్యూ ఆర్లీన్స్ : లూసియానా తీర ప్రాంతాన్ని 'ఐదా' తుపాను వణికిస్తోంది. ప్రమాదకరమైన 4వ కేటగిరీకి చెందిన తుపానుగా మారుతున్న ఐదా ఆదివారం తెల్లవారు జాము నుండి క్రమేపీ బలపడుతూ వస్తోంది. ఇది లూసియానా వద్ద తీరం దాటే అవకాశముందని భావిస్తున్నారు.కరోనా ముప్పు వున్నప్పటికీ ఈ ప్రాంతంలో నిర్వాసితులైన వారి కోసం అధికారులు అత్యవసర ప్రాతిపదికన షెల్టర్లు ప్రారంభించారు.గంటకు 209 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తాయని జాతీయ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే లూసియానా, మిస్సిసిపిల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. 16ఏళ్ళ క్రితం ఇదే తేదీన సంభవించిన కత్రినా తుపాను లూసియానా, మిస్సిసిపిలను కకావికలం చేసేసింది.
మళ్ళీ ఇప్పుడు ఐదా తుపాను అదే రీతిలో భయపెడుతోంది. ఇప్పటికే కోవిడ్ ఇన్ఫెక్షన్లు నెమ్మదిగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా వుండడం, డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాపించడంతో తాజాగా తుపాను కారణంగా ఈ ప్రాంతం చిగురుటాకులా వణికిపోతోంది. మిస్సిసిపి తీరంలోని గల్ఫ్‌పోర్ట్‌లో తరలింపుదారుల కోసం సూచనలు, హెచ్చరికలు చేస్తూ రెడ్‌క్రాస్ షెల్టర్ బోర్డు పెట్టారు. అందరినీ మాస్క్‌లు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నామని, వ్యాక్సిన్లు అయ్యాయా లేదా అనేది పరిశీలించడం లేదని, అయితే రోజుకు రెండు మూడుసార్లు ఉష్ణోగ్రతను చెక్ చేస్తున్నామని షెల్టర్ల నిర్వాహకులు తెలిపారు.