Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఆదివారం అరెస్టు చేసింది. అర్మాన్ నివాసం నుంచి నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఆరోపణలతో ఎన్సిబి శనివారం అతన్ని విచారించింది. ఆదివారం మళ్లీ అర్నాన్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్సిబి బృందం అతన్ని అదుపులోకి తీసుకుని దక్షిణ ముంబయిలోని తన కార్యాలయానికి తరలించింది. ఆదివారం సోదాల్లో అర్మాన్ నివాసం నుంచి కొద్ది మొత్తంలో కొకైన్ లభించినట్లు సమాచారం. కాగా, ఇప్పటికే ఎన్డిపిఎస్ చట్టం కింద డ్రగ్స్ వ్యాపారి అజరురాజు సింగ్ను ఎన్సిబి అరెస్టు చేసింది.