Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతోంది. కరోనా సోకి ఆస్పత్రిపాలైన ఏడాది తర్వాత కూడా ఈ మహమ్మారి వారిని వదలడం లేదు. కరోనా బారినపడ్డ వారిలో దాదాపు సగం మంది.. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఏడాది తర్వాత కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని తాజాగా పలువురు పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. తాజాగా ఈ అధ్యయన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురితమైంది. చైనాలోని వుహాన్‌లో 1,276 మందిపై పరిశోధన చేసి.. ఈ విషయాన్ని వెల్లడించారు. కొందరు రోగులు కోలుకోవడానికి ఏడాది కన్నా ఎక్కువ సమయం పడుతోంది. కాబట్టి కరోనా అనంతరం అందించాల్సిన వైద్య సేవలకు ప్రణాళిక రచించేటప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. పరిశోధనలో భాగంగా గత ఏడాది జనవరి 7 నుంచి మే 29 మధ్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కరో నా బాధితులపైపరిశీలన చేపట్టారు. 6 నెలలు, ఏడాది సమయంలోవీరికి పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. తద్వారా వారిలో వ్యాధి లక్షణాలు, ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ అధ్యయనం వెల్లడిం చిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి... కరోనా తీవ్రతతో సంబంధం లేకుండా వ్యాధి లక్షణాల్లో అనేకం.. కాలక్రమేణా తగ్గిపోయాయి. అయితే ఆరు నెలల సమయంలో వీరిలో 68 శాతం మందిలో కనీసం ఒక్క లక్షణమై నా కనిపించింది. 12 నెలలకు అది 49 శాతానికి తగ్గింది. కరోనా నుంచి కోలుకున్న 6నెలల తర్వాత ఎక్కువగా కనిపించిన సమస్యలు.. అలసట, కండరాల బలహీనత. దాదాపు సగం మందిలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఏడాది తర్వాత.. ప్రతి ఐదుగురిలో ఒకరిని ఈ సమస్యలు వదల్లేదు. 12 నెలల తర్వాత ప్రతిముగ్గురిలో ఒకరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు న్నాయి. ఆరు నెలల సమయంలో మాత్రం ఇంకా ఎక్కువ మందిని ఈ సమస్య పీడించింది. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నవారిలో ఎక్కువ మందిలో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆరు నెలల సమయంలో 353 మంది ఛాతీకి సీటీ స్కాన్ నిర్వహించగా.. సగం మందికి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్టు తేలింది. 118 మందికి 12 నెలల తర్వాత కూడా దీన్ని నిర్వహించారు. అప్పటికల్లా సమస్యలు తగ్గినప్పటికీ.. కొందరిలో అవి కొనసాగాయి. పురుషులతో పోలిస్తే మహిళలు ఏడాది తర్వాత 1.4 రెట్లు ఎక్కువగా అలసట, కండరాల బలహీనతలు ఉన్నాయి.