Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎఫ్ ఖాతాతో ఆధార్ లింక్ చివరిగడువు సెప్టెంబర్ 1
న్యూఢిల్లీ: పాన్‌కార్డు,పీఎఫ్ అకౌంట్లకు ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి చివరి గడువు సమీపిస్తుండటంతో ఈ అంశంపై నెలకొన్న సందిగ్దతకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది. ఆధార్ అనుసంధానంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని వెల్లడించింది. పాన్‌కార్డు, ఈపీఎఫ్ అక్కౌంట్లతో ఆధార్ అనుసంధానికి సంబంధించి గత కొద్ది కాలంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. యూఐడీఏఐ సిస్టమ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయంటూ వస్తున్న వార్తలపై తాజాగా యూఐడీఏఐ స్పందించింది. ప్రస్తుతం ఎలాంటి సాంకేతిక సమస్యల్లేవని తెలిపింది. ఆధార్ లింక్ గడువు తేదీ సమీపించడంతో వివిధ మీడియాల్లో విభిన్న కథనాలు వస్తుండటంతో స్పందించాల్సి వచ్చిందని వివరించింది. ఎన్రోల్మెంట్, మొబైల్ నెంబర్ అప్డేట్ సర్వీసుల్లో కొంత అసౌకర్యం కల్గిన మాట వాస్తవమేనని పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఆ సమస్య కూడా పరిష్కారమైందని యూఐడీఏఐ తెలిపింది. ప్రస్తుతం పాన్ కార్డు, పీఎఫ్ ఆకౌంట్లకు ఆధార్ లింక్‌కు ఏ విధమైన సంబంధం లేదని, లింక్ అప్‌గ్రేడేషన్ కొనసాగుతోందని వెల్లడించింది. రోజుకు 5 లక్షల మందికి పైగా అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనీ, గత 9 రోజుల్లో 50 లక్షలమంది అప్‌గ్రేడ్ చేసుకున్నారని పేర్కొంది. కాగా, పీఎఫ్ అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి చివరి తేది సెప్టెంబర్ 1 కాగా, పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు చివరి తేది సెప్టెంబర్ 30 వరకు ఉంది. ఈపీఎఫ్ ఇటీవల తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పీఎఫ్ అకౌంట్లో జమచేసే నగదుపై ప్రభావం పడుతుంది.