Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నూతనంగా ప్రవేశపెట్టిన ఏసీ త్రీ టైర్ ఎకనామీ క్లాస్ కోచ్‌ల ధర ప్రస్తుతం ఉన్న 3ఏసీి కోచ్లకన్నా 8 శాతం తక్కువగా ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. వివిధ రైల్వే జోన్లకు ఇలాంటివి 50 కోచ్‌లను ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్లీపర్ క్లాస్ కోచ్‌ల స్థానంలో వీటిని అమర్చనున్నట్లు తెలిపింది. 300 కిలోమీటర్ల దూరానికి రూ 440 ధర నిర్ణయించారు. 4,951 కిలోమీటర్ల నుంచి 5 వేల కీమీటర్లకు రూ 3,065 ధర నిర్ణయించారు. ఈ కోచ్‌లతో సెప్టెంబర్ 6 నుంచి ప్రయాణం చేసే ట్రైన్ నంబర్ 02403 (ప్రయాగ్‌రాజ్-జైపూర్ ఎక్స్‌ప్రెస్)కు శనివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించినట్లు రైల్వేశాఖ తెలిపింది.