Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపురలో కొనసాగుతున్న ఆందోళనలు
అగర్తలా : ' నా ఉద్యోగం ఎక్కడీ' పేరుతో త్రిపురలో డివైఎఫ్ఐ ఆధ్వర్యాన జరుగుతోన్న ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చిమ త్రిపుర లోని మోహన్పూర్ పట్టణంలో డివైఎఫ్ఐ- టివైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, యువజనులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బిజెపి ప్రభ్వుత్వ తీరును నిరసిస్తూ గట్టిగా నినాదాలు చేశారు. 50వేల ప్రభుత్వోద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైం దని నిలదీశారు. నిరుద్యోగ యువతకు తక్షణం ఉపాధి అవకాశాలు కల్పిం చాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్త ల పోస్టులను భర్తీ చేయాలన్నారు. 10,323 మంది తాత్కాలిక ఉపాధ్యా యులను పర్మినెంట్ ఉద్యోగాల్లో నియమించాలని డిమాండ్ చేశారు.
బెంగాల్లో వామపక్ష కార్యకర్తల రక్తదానం
కోల్కతా : కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విధించిన ఆంక్షల ప్రభావం దాదాపు అన్నిరంగాలపై పడింది. అన్నిరకాల కార్యకలాపాలు స్తంభించడంతో పాటు ప్రాణాలతో ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి రక్తం సరఫరా చేసే బ్లడ్ బ్యాంకులపై కూడా ఆంక్షల ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో వామపక్ష కార్యకర్తలు అత్యవసర సమయంలో అవసరమైన కార్యక్రమానికి పూనుకున్నారు.