Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలగాల కాల్పుల్లో ఇద్దరి మృతి
న్యూఢిల్లీ : సరిహద్దు గస్తీ దళాలపై బంగ్లాదేశ్‌కు చెందిన స్మగ్లర్లు దాడికి పాల్పడడంపై భారత సరిహద్దు దళం(బిఎస్ఎఫ్) బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బిజిబి)కి నిరసన తెలిపింది. దాడి నేపథ్యంలో అత్మరక్షణలో భాగంగా బిఎఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు స్మగ్లర్లు మరణించారని సోమ వారం ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమబెంగాల్ కూచ్‌బెహర్ జిల్లాలోని చంగ్రబంధ సరిహద్దు పాయింట్ వద్ద ఆదివారం వేకువజామున 3.35 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. '' సరిహద్దు వెంట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో 18-20 మంది బంగ్లాదేశీ స్మగ్లర్లు జవాన్లను చుట్టుముట్టారు. ప్రాంతాన్ని విడిచివెళ్లాలని బలగాలు సూచిం చినా వారు పట్టించుకోలేదు. పైగా దాడికి పాల్పడి పలువురు జవాన్లను తీవ్రంగా గాయపరిచారు. ప్రాణాలకు ముప్పును గమనించిన గస్తీ జవాన్లు వేరేమార్గం లేక అత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపారు' అని బిఎస ్ఎఫ్కు చెందిన నార్త్ బెంగాల్ ఫ్రంటియర్ తన ప్రకటనలో పేర్కొంది. ఘట న గురించి బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బిజిబి)కి తెలిపి నిరసన వ్యక్తం చేశామని తెలిపింది. బంగ్లాదేశ్‌తో భారత్ పంచుకుంటున్న 4,096 కిలోమీటర్ల సరిహద్దులో 932 కి.మీ మేర నార్త్ బెంగాల్ ఫ్రంటియర్ గస్తీ కాస్తుంది.