Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీనే పీఎం అభ్యర్థి: కేసీ త్యాగి
పాట్నా: రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయో ఊహించడం కష్టమేననీ ఇప్పటికే అనేక ఘటనలు రుజువుచేశాయి. ఈ క్రమంలోనే వచ్చే సాధారణ ఎన్నికలకు సంబంధించి ప్రధాని అభ్యర్థిగా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఊహించని విధంగా ప్రస్తుతం ఇదే అంశంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ పేరు చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మీడియాతో మాట్లాడిన జేడీయూ జనరల్ సెక్రెటరీ కేసీ త్యాగి.. నితీష్ కుమార్ ప్రధాని పదవికి అన్ని విధాలుగా తగిన వ్యక్తి అని అన్నారు. పీఎంకు ఉండాల్సిన అర్హతలు ఆయనకు ఉన్నాయని తెలిపారు. నితీష్‌కు 16 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన పనితీరు గురించి దేశంలో అందరికీ తెలుసని చెప్పారు. అయితే, ప్రస్తుతం ప్రధాని పదవి ఖాళీగా లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై జేడీయూ క్లారిటీ ఇచ్చింది. ప్రధాని అయ్యేందుకు కావాల్సిన అన్ని లక్షణాలు, అర్హతలు నితీష్‌కు ఉన్నాయి.. కానీ, పీఎం రేసులో ఆయన లేరని తెలిపింది. ఇదే అంశంపై నితీష్‌ను మీడియా ప్రశ్నించగా.. ఇదంతా నాన్సెన్స్ అంటూ ఆయన కొట్టిపారేశారు. ప్రధాని కావాలని తానెప్పుడూ కోరుకోలేదనీ, ఆ పదవిని ఆశించలేదని స్పష్టం చేశారు.