Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరిద్వార్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ల జారీ
డెహ్రాడూన్: కుంభమేళా సమయంలో వెలుగులోకి వచ్చిన కరోనా టెస్ట్ స్కామ్ కేసుకు సంబంధించి హరిద్వార్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వివరాల్లోకెళ్తే.. ఈ ఏడాదిలో ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన కుంభమేళ సమయంలో కరోనా నకిలీ టెస్ట్ స్కామ్ వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే పలు ల్యాబులు, వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా హరిద్వార్ న్యాయస్థానం కరోనా నకిలీ పరిక్షీల స్కామ్ పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాక్స్ కార్పొరేట్ సర్వీసెస్‌కు చెందిన మల్లికా, శరత్ పంత్, నల్వా పాత్ ల్యాబ్‌లకు చెందిన డాక్టర్ నవతేజ్ నల్వపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులకు వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ వారెంట్లను హరిద్వార్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జారీ చేసింది.
పై రెండు కంపెనీలకు చెందిన యజమానులతో పాటు మరో మూడు కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. వీరిని అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగిందని హరిద్వార్ ఎస్ఎస్పీ సెంథిల్ అవోడై కష్ణ రాజ్ చెప్పారు.
నిందితుల కోసం పోలీసు బృందాలను ఉత్తరప్రదేశ్, హర్యానా, న్యూఢిల్లీకి పంపించామని ఆయన చెప్పారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు కుంభమేలా సమయంలో కరోనా పరీక్షలు నిర్వహించకుండా.. ఒక వేళ నిర్వహించినా.. ఫలితాలతో సంబంధం లేకుండా నెగటివ్ రిపోర్టులు ఇచ్చారు. ఒక్కో రిపోర్టుకు వేలల్లో డబ్బును వసూలు చేశారనే అభియోగాలున్నాయి. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు అధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు.