Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల పిలుపు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబరు 6 నుంచి మూడు రోజులపాటు ధర్నాకు దిగనున్నారు. టెలికం సంస్థ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వారు ఈఆందోళనకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఆల్ యూ నియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్ (ఏయూఏబీ) పిలుపునిచ్చింది. ఆరు నుంచి జరిగే ఈ ధర్నాలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. తమ డిమాండ్లను వెంటనే నెరవే ర్చాలని ఉద్ఘాటించింది. 4జీ సర్వీసుల ప్రారంభంతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) నుంచి బకాయిల క్లియరెన్స్ చేయాలని డిమాండ్ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఇటీవలే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా నిరసనకు దిగిన విషయం విదితమే.