Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కారు వ్యతిరేక పోస్టులు పెడితే ఉక్కుపాదం
- సోషల్ మీడియా ఖాతాలపై నిఘా
- ఉద్యోగాలు బంద్, పాస్‌పోర్టులు రద్దు
- మూడు రాష్ట్రాల్లో అమలు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ మోడీ ప్రభుత్వ అణచివేత విధానాలు కొనసాగుతున్నాయి. రాయిటర్స్ సంస్థ తాజాగా ప్రకటించిన కథనం ప్రకారం సహజంగానే అన్యాయాలను, అక్రమాలను ప్రతిఘటించే యువతను లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తున్నారు. దీనిలో భాగంగా యువతీ, యవకుల సోషల్ మీడియా ఖాతాలపై పెద్ద ఎత్తున నిఘా పెడుతున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ప్రజా ఉద్యమాలు, మానవ హక్కులను బలపరుస్తూ వ్యాఖ్యలు చేసినా వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాజద్రోహ ముద్ర వేయడంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించడం, పాస్‌పోర్టులు రద్దు చేయడం లేదా తిరస్కరిచడం వంటి చర్యలకు దిగుతున్నారు. ప్రత్యక్షంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటే మరింత కఠిన చర్యలు తీసుకుంటు న్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రా ల్లో ఈ తరహా నిర్బంధ చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ చర్యలపై ఎక్కడికక్కడ పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేదు. పైగా ఆ రాష్ట్రాల పోలీసు అధికారులు ఈ తరహా చర్యలను సమర్థిస్తూ ప్రకటనలు కూడా చేస్తుండ డటం గమనార్హం. ' ఏ తరహా నిరసన ప్రద ర్శనల్లో పాల్గొన్నా లేదా ప్రచారం చేసినా పాస్‌పోర్టులు రద్దు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటిస్తాం' అని బీహార్ రాష్ట్ర పోలీస్ శాఖ ఇటీవల ప్రకటించింది. ఉత్తరాఖండ్ పోలీసులు సోషల్ మీడియా పోస్టులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామని, సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక పోస్టులు కనపడితే వారి పాస్‌పోర్టు దరఖాస్తులు రద్దు చేస్తామని ప్రక టించారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అక్కడ ఇప్పటికే పలువురిని ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించినట్లు సమాచారం. ఈ రాష్ట్రాల్లో సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టడానికి పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
పాస్‌పోర్టులపై దృష్టి ఎందుకు...?
ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు పాస్‌పోర్టులపై ప్రత్యే కంగా దృష్టి సారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాస్‌పోర్టు పొందడానికి పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరన్న సంగతి తెలిసిం దే. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమల్లో పాల్గొన్నా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా పోలీస్ వెరిఫికేషన్‌లో వ్యతి రేక అభిప్రాయాన్ని నమోదు చేస్తున్నారు. దీంతో పాస్‌పోర్టు మంజూరు ఆగిపోతోంది. ఇది విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లేవారితోపాటు, చదువుల కోసం వెళ్లే వారిపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో నిమిత్తం లేకుండానే అమెరికా వంటి దేశాలు వీసాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
అణిగిఉంటే ఉద్యోగాలిస్తారా...?: ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేటు ఉద్యోగవకాశాలు కూడా దేశంలో నానాటికి తీసికట్టు అవుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం జులై నెలలో 6.95 శాతంగా ఉన్న జాతీయ నిరుద్యోగ రేటు ఆగస్టు నెలాఖరుకు 8.1 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 8.30 శాతం నుండి 9.7కు, గ్రామీణ ప్రాంతాల్లో 6.34 శాతం నుండి 7.3కు నిరుద్యో రేటు పెరిగింది. ప్రభుత్వ రంగాన్ని తెగనమ్మి కార్పొరేట్లకు అప్పచెబుతుండటంతో ఉన్న సర్కారీ కొలువులే ఊడుతు న్నాయి. కేంద్ర ప్రభుత్వం దానికి భిన్నంగా గొంతునొక్కే చర్యలకు దిగడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.