Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో కరోనా ఆంక్షలు సడలింపు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతోంది. ఇదివరకు తగ్గుతూ వచ్చిన పాజిటివ్ కేసులు అధికమవుతుండటం.. థర్డ్‌వేవ్ అంచనాలు అందోళన కలిగిస్తున్నాయి. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,909 కొత్త కేసులు, 380 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా మహమ్మారి కేసులు 3,27,37,939కి చేరగా, మరణాలు 4,38,210కి పెరిగాయి. ఇప్పటివరకు దేశంలో 3.19 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 3,76,324 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 1.15 శాతం, రికవరీ రేటు 97.51శాతానికి చేరింది. పాజిటివిటీ రేటు 2.4 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 52,01,46,525 కరోనా పరీక్షలు నిర్వహించారు. 63.43కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్రం తెలిపింది.
కాగా, దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్‌లు ఉన్నాయి. అయితే, ఆదివారం దేశంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికం (29,836) కేరళలో నమోదయ్యాయి. అయితే, అక్కడ కేసుల ట్రేసింగ్, గుర్తింపు, కరోనా పరీక్షలు వేగవంతంగా జరుగుతుండటంతో కేసులు అధికంగా వెలుగులోకి వస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుండగా, ముంబయిలోని మంఖుర్ధ్ ప్రాంతంలోని చిల్డ్రన్స్ హౌమ్‌లో 18 మందికి కరోనా సోకడం కలకలం రేపింది. వీరందరూ క్వారంటైన్లో సురక్షితంగానే ఉన్నారని బీఎంసీ అధికారులు వెలిపారు. జన్మాష్టామి నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కరోనా ఆంక్షలను సడలించింది. రెండు రోజుల పాటు నైట్ కర్ఫ్యూతో పాటు మరిన్ని సడలింపులు ఇస్తున్నట్టు పేర్కొంది.
అమెరికాలో తగ్గని ఉధృతి
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 21,73,82,28 మందికి కరోనా సోకింది. 45,18,50 మంది మరణించారు. 19,43,08,900 మంది కోలుకున్నారు. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల్లో అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, యూకే, టర్కీ, అర్జెంటీనా, ఇరాన్, కొలంబి యాలు టాప్-10లో ఉన్నాయి. అమెరికాలో కొత్త కేసుల పెరుగుదల కారణంగా అక్కడి ఆస్పత్రుల్లో రోగులు పెరుగుతున్నారనీ, ఫ్లోరిడా, దక్షిణ కరోలినా, టెక్సాస్, లుథియానాల్లో ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతలోకి వెళ్తున్నట్టు సీఎన్ఎన్ పేర్కొంది. న్యూజిలాండ్‌లో వ్యాక్సిన్ కారణంగా తొలి మరణం నమోదైనుట్ట అక్కడి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయిల్‌లో 12 ఏండ్లు దాటిని వారికి టీకాను అందుబాలోకి వచ్చింది.