Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్లోని క్షేత్రస్థాయి పరిస్థితులను విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్, ఎన్ఎస్ఎ చీఫ్ అజిత్ ధోవల్, ఇతర పలువురు సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. భారత తక్షణ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని వారు చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నాయి. ప్రధాన మంత్రి మోడీ సూచనల మేరకు వీరంతా గతకొన్ని రోజులుగా క్రమం తప్పకుండా సమావేశమవుతున్నారని సంబంధిత అధికారులు తెలిపారు. ఆఫ్ఘన్లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తీసుకురావడంతో పాటు భారత్కు ఆఫ్ఘనీయుల (ప్రత్యేకంగా అక్కడి మైనార్టీలైన హిందువులు, సిక్కులు) తరలింపు, భారత్కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఉగ్రకార్యకలాపాలకు ఉపయోగించకుండా హామీ పొందేందుకు బృందం చర్చలు జరుపుతోందని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో క్షేత్రస్థాయి పరిస్థితులతో పాటు ఐరాస భద్రతా మండలి తీర్మానం, ఇతర అంతర్జాతీయ స్పందనలను కూడా పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.