Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 మంది మృతి ొ ఆరుగురికి గాయాలు
జైపూర్ : రాజస్తాన్‌లోని నాగౌర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక భారీ ట్రక్‌ను క్రూయిజర్ వాహనం ఢకొీనడంతో వాహనంలో ఉన్న 8 మంది మహిళలతో సహా 12 మంది మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.బాధితులంతా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాకు చెందినవారు. మధ్య ప్రదేశ్‌కు చెందిన కొంత మంది భక్తులు రాజస్తాన్‌లోని బికనీర్‌కు సమీపంలో దెశ్నోక్లోని కర్ణి మాతా దేవాలయాన్ని దర్శించుకుని రెండు వాహనాల్లో తిరుగు ప్రయాణమయ్యారు. ఇందులో ఒక వాహనం భారీ ట్రక్‌ను ఢకొీంది. బికనీర్-జోధ్‌పూర్ హైవేపై శ్రీబాలాజీ ప్రాంతంలోని ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలోనే ఎనిమిది మంది మరణించగా,మిగిలిన వారు ఆసుపత్రులకు తరలిస్తుండగా మృతి చెందారు.క్షతగాత్రుల్ని సమీపంలోని నోఖా పట్టణం, బికనీర్ ఆసుపత్రులకు తరలించారు.