Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సెప్టెంబరు 25న సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తలపెట్టిన భారత్‌బంద్‌కు తాము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామని'సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్' (సీఐటీయూ) ప్రకటించింది.ఈ బంద్‌లో దేశవ్యాప్తంగా కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది.నూతన సాగు చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లులను మోడీ సర్కార్ ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర దక్కటంలో చట్టపరమైన హామీ కల్పించాలని..తదితర డిమాండ్లను కేంద్రం ముందు ఉంచుతూ ఎస్కేఎం సెప్టెంబర్ 25న భారత్‌బంద్‌కు పిలుపునిచ్చింది.దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లోని 500కుపైగా రైతు సంఘాలు 'సంయుక్త కిసాన్ మోర్చా' పేరుతో ఒక గొడుగుకిందకు చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎస్కేఎం జాతీయ సదస్సు జరగగా..అందులో 2వేల మంది రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఎస్కేఎం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన ఉధృతం చేయాలని తీర్మానం చేసింది. ఎస్కేఎం తీర్మానాన్ని సీఐటీయూ ఆహ్వానించింది. హర్యానాలోని కర్నాల్‌లో శాంతియుతంగా నిరసనలు జరుపుతున్న రైతులపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయటాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. రైతుల డిమాండ్లు న్యాయమైనవని, వాటిని నెరవేర్చాలని సీఐటీయూ అభిప్రాయపడుతోంది.రైతు ఆందోళనలో కార్మికులు, విద్యార్థులు, మహిళల్ని భాగస్వామ్యం చేయాలని ఎస్కేఎం నిర్ణయించటంపై సీఐటీయూ హర్షం వ్యక్తం చేసింది. గతకొన్ని నెలలుగా ఢిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సీఐటీయూ గట్టి మద్దతు పలుకుతోంది. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ఉద్యమంలో కార్మిక సంఘాలు చురుకుగా పాల్గొంటున్నాయి. రైతు సంఘాల నాయకులకు అండగా నిలబడుతూ సంపూర్ణమద్దతు తెలుపుతోంది. కేంద్రంలో మోడీ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మార్చాలన్నదే కేంద్రం ఉద్దేశమని పేర్కొంది.