Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తాలిబన్లతో భారత్ మొదటిసారిగా సమావేశమైంది. దోహాలోని భారత్ ఎంబసీలో ఈ సమావేశం జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఆఫ్ఘన్ ఆర్మీ ఆఫీసర్గా పషఉ్తన్ అయిన స్టానెక్జారుకు శిక్షణ ఇచ్చారు. ఆయన మూడు రోజుల క్రితం ఒక ప్రకటన చేస్తూ, భారత్తో సాధారణ వాణిజ్య, దౌత్య, రాజకీయ సంబంధాలను పెట్టుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. తొలుత భారత్ దీనిపై మౌనంగానే వుంది. కానీ అమెరికా తన బలగాల ఉపసంహరణను పూర్తి చేసిన అనంతరం సమావేశమైంది. అన్ని పక్షాల వారీతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు భారత్ చెబుతూ వచ్చింది. కాని ఈసారి సమావేశాన్ని అధికారికంగా ధృవీకరించింది. భారత్కు రావాలనుకునే వారిని సురక్షితంగా పంపించే విషయంపైనే భారత్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ వారు కాబూల్ వదిలివెళ్ళడానికి తాలిబన్లు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు.