Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
అమరావతి : పాఠశాలలు తెరవడం వల్ల పిల్లలకు కరోనా వస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నిం చింది. కరోనా తీవ్రత తగ్గకుండా పాఠశాలలు తిరిగి ప్రారంభించడం ఎంతవరకు సముచిత మని ప్రశ్నించింది. క్షేత్రస్థాయిలో వాస్తవ నివేదికలు తెప్పించుకున్న తర్వాతే ప్రభుత్వ పాఠశాలలను తెరుస్తోందా? 16 నెలలుగా మూతపడ్డాయని తెరుస్తున్నారా? అనే సందేహాన్ని వ్యక్తం చేసింది. టీచర్లకు వ్యాక్సిన్ వేస్తే సరిపోదని, పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభమే కాలేదని గుర్తు చేసింది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అధికారుల అడుగులు ఉండాలని సూచించింది. తదుపరి విచారణ అక్టోబరు 1కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బి.దేవానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తేలిగ్గా తీసుకోవద్దు
రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు, మరణించే వారి సంఖ్య తక్కువగా ఉందని తేలిగ్గా తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరికతో కూడిన సూచన చేసింది. కరోనా నిబంధనలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మూడో దశ వ్యాప్తి హెచ్చరికలు కూడా ఉన్నాయని గుర్తు చేసింది. రాష్ట్రంలో కోవిడ్‌కు సంబంధించి వేర్వేరు పిల్స్‌ను చీఫ్ జస్టిస్ ఎకె గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు గురించి వివరాలు అడిగి తెలుసుకుంది. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.