Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలవ్యాపారం చేసుకోవాలని యూపీ సీఎం హితవు
లక్నో: మథురలో మాంసం, మద్యంపై నిషేధం విధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీకష్ణుడి జన్మస్థలమైన మధురలో మద్యం, మాంసం నిషేధిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రకటించారు. శ్రీకష్ణ జన్మాష్టమి వేడుక సంద ర్భంగా సీఎంయోగి ఈ నిర్ణయం తీసుకు న్నారు. మద్యం, మాంసం అమ్మకాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ అధికారు లకు ఆదేశాలు సైతం జారీ చేశారు. శ్రీమహావిష్ణువు జన్మించిన పవిత్ర స్థలంలో మద్యం, మాంసాలు విక్ర యించకూడదని సీఎం యోగీ ఆదిత్యానాథ్ నిర్ణయిం చారు. మద్యం,మాంసం వ్యాపారం చేస్తున్న వారంతా పాల ఉత్పత్తిని పెంచి మథురకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నారు. పాలు, మీగడ, వెన్న, నెయ్యి అంటే శ్రీకష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవనీ యోగి అన్నారు. పాలను, పాల పదార్థాల ఉత్పత్తులకు పెంచి మధురకు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని మధుర ప్రజలకు యోగి పిలుపునిచ్చారు. అలాగే, తాను కరోనా మహమ్మారిని పారద్రోలాలని శ్రీకష్ణు డిని ప్రార్థించినట్టు చెప్పుకొచ్చారు. రాష్ట్ర రాజధాని లక్నోలో జరిగిన కార్యక్రమంలో ఆయన మద్యం, మాంసం నిషేధం గురించి పై వివరాలు వెల్లడిం చారు. కానీ ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు.