Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆడపిల్లలను రక్షిద్దాం
- సోషల్ మీడియాలో కేరళ మహిళాశిశుసంక్షేమ శాఖ వినూత్న ప్రచారం
- భారీగా స్పందన
తిరువనంతపురం: ఆడపిల్లలను సంరక్షించడం పై కేళర రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ (డబ్ల్యూసీడీ) సోషల్మీ డియాలో చేస్తున్న ప్రచారం వినూత్నంగా ఉండి, ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రచారంతో ఆడపిల్లల విషయంలో రాజీ వద్దనే విషయాన్ని మంత్రిత్వశాఖ చెబుతోంది. ఆడపిల్లలకు మంచి విద్య, ఉద్యోగం వంటి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాలనే అర్థంతో కూడిన నినాదాలను ప్రచారం చేస్తోంది. మహిళాసాధికారతపై గత ఏడాది డిసెంబరులో ప్రారంభమై నాలుగు నెలల ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో ఈ ప్రచారం ఇంకా కొనసాగుతోంది. స్వేచ్చ అనేది స్త్రీల హక్కు అని, దానిని మాంగల్య బంధంతో బంధించవద్దని డబ్ల్యూసీడీ ప్రచారం నిర్వహిస్తోంది.ప్రచారానికి మంచి స్పందన వస్తుండటంపై మైత్రి అడ్వర్టటైజింగ్ వర్క్స్ క్రియేటివ్ హెడ్ (డిజిటల్) అజరు సత్యమ్ స్పందించారు. 'ప్రచారం సృజనాత్మకంగా ఉండా లని కోరుకున్నాం. ఇంత అదరణ వస్తుందని అనుకో లేదు. నటులు ఇంద్రజిత్, పూర్ణిమా ఇంద్రజిత్తో చేసిన రెండు వీడియోలకు స్పందన బాగుంది. మహిళలు అంటే అర్థమేమిటి, వారు ఏం సాధించాలనే అనే విషయాలే లక్ష్యంగా ఈ ప్రచారం ప్రారంభించాం' అని చెప్పారు. డబ్ల్యూసీడీ డైరెక్టర్ అనుపమ మాట్లాడుతూ మైత్రి అడ్వర్టటైజింగ్ వర్క్స్, మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ ప్రచారాన్ని రూపొందించినట్టు చెప్పారు.వరకట్నం, గృహహింస ,సంబంధాలను దుర్వినియోగం చేయడం, లింగ సమానత్వం, కుటుంబ నియంత్రణ, లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్.. వంటి అంశాలకు వ్యతిరేకంగా ఈ ప్రచారాలను తయారు చేశారు. ఇందులో చాలా వరకూ వైరల్ అయ్యాయి. మదర్స్ డే సందర్భంగా 'అమ్మ'ప్రచారం,లింగ వివక్షకు వ్యతిరేక ంగా గాయకుడు అర్యా దయాల్ చేసిన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ప్రచారం ఎంతగా ఆదరణ పొందిందంటే డిసెంబరు ముందు వరకూ డబ్ల్యూసిడి ఫేస్‌బుక్‌కు సుమారు 2వేల లైక్‌లు,యూట్యూబ్ ఛానెల్‌కు సుమారు 500 సబ్స్క్రైబర్లు ఉండేవారు. ఇన్స్టాగ్రామ్ అనేది ఉనికిలోనే లేదు.ఈ ప్రచారం తరువాత ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు 85వేలకు పైగా లైకులు, ఇన్‌స్ట్రాగ్రామ్‌కు 30 వేలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌కు 65 వేలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. డబ్ల్యూసీడీ తన సోషల్ మీడియాలో ఈ ప్రచారంతోపాటు రోజువారీ పోస్టులు కూడా ఉంచుతుంది.